Monday, December 11, 2023

Odisha-365
google-add

DRIVING LICENCE : డ్రైవింగ్  లైసెన్స్ కార్డులు చూపాల్సిన అవసరం లేదు

T Ramesh | 11:48 AM, Sat Aug 19, 2023

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో రవాణాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కార్డులు బదులు డిజిటల్ సాఫ్ట్ కాపీలే సరిపోతాయని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.  లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు రూ.200, పోస్టల్ ఖర్చుల నిమిత్తం రూ. 25 కలిపి మొత్తం రూ. 225 వసూలు చేసేవారు. ఇప్పుడు ఈ ఛార్జీలు వసూలు చేయడ లేదు. ఇప్పటికే చెల్లించినట్లైతే వారికి త్వరలో కార్డులు అందజేస్తారు.

కేంద్రప్రభుత్వం ‘వాహన్ పరివార్’ తో సేవలన్నీ ఆన్ లైన్ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులు తొలగించి, డిజిటల్ పత్రాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసే పోలీసులు, రవాణశాఖ అధికారులకు డౌన్ లోడ్ చేసిన కాపీలు చూపిస్తే సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.

రవాణా శాఖ వెబ్‌సైట్ https//aprtstgen.epragati.org form 6 లేదా 23ని డౌన్లోడ్ చేసుకొని ధ్రువపత్రాన్ని తీసుకోవాలి.  

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add