Monday, December 11, 2023

Odisha-365
google-add

DURGA NAVARATRI: దసరా మహోత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

T Ramesh | 12:45 PM, Tue Sep 19, 2023

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. నవరాత్రుల సందర్బంగా దుర్గమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులను అనుగ్రహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయిచింది.

నవరాత్రుల్లో మొదటి రోజైన 15వ తేదీ ఆదివారం నాడు అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. రెండోరోజు ఆశ్వియుజ శుద్ధ విదియ నాడు శ్రీ గాయత్రీ దేవి గా కటాక్షిస్తారు. ఇక మూడోవ రోజు అంటే 17న తదియ రోజు శ్రీఅన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ తల్లి పూజలు అందుకోనుంది. 18వ తేదీ బుధవారం నాడు శ్రీమహాలక్ష్మీ దేవిగా సిరుల తల్లి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువుదీరతారు.

ఐదోవ రోజు 19 వ తేదీన శ్రీమహా చండీదేవి అలంకరణలో దర్శనమిచ్చి భక్తులకు అభయమియ్యనున్నారు ఆరో రోజు శుక్రవారం(20వ తేదీ)న మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవిగా విద్యాబుద్ధులు ప్రసాదించారు. ఈ రోజే సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఏడో రోజు అంటే 21 తేదీన అమ్మవారు శ్రీలలిత త్రిపుర సుందరీ దేవిగా విశేష పూజలు అందుకోనున్నారు.

ఎనిమిదో రోజు అంటే 22 తేదీన అశ్వియుజ అష్టమి సందర్భంగా అమ్మవారు భక్తులను కాచికాపాడే శ్రీదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తారు. నవరాత్రుల్లో ఆఖరి రోజైన 23న ఉదయం శ్రీమహిషాసురమర్ధినీ దేవిగా మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ అమ్మ అలంకారంలో భక్తులను కటాక్షిస్తారు.

దసరా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే నవరాత్రుల అలంకారాల గురించి ఆలయ అధికారులు పూర్తి వివరాలను దేవస్థాన వెబ్‌సైట్ లో పొందుపరిచారు. ఉత్సవాల సందర్బంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add