Karnataka votes to elect a new government today as stakes are high for the BJP and higher for the Congress with 2,615 candidates in the fray for 224 assembly constituencies. Polling is scheduled across 58,545 polling stations including auxiliary polling stations and a total of 42,48,028 new voters have been registered to vote for the elections.
Read Moreరాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
Cyclone information…ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ప్రభావం...! ఆందోళనలో రైతులు
టీడీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మందికి యావజ్జీవ శిక్ష
వరలక్ష్మీ వ్రతం : పూాజా విధానం
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
కావలసినవస్తువులు
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.
తోరం ఎలా తయారుచేసుకోవాలి
తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, తొమ్మిదో పువ్వులతో తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. అమ్మవారికి ఇరువైపుల లేదా ఒక్కవైపున దీపారాధన చేయండి. దీపం ఉత్తరం లేదా ఆగ్నేయం లేదా మీకు అవకాశం ఉన్నవైపు పెట్టండి. దీపాన్ని వెలిగించిన తర్వాత కింది చెప్పినట్లు వ్రతం చేసుకోండి.
ఆచమనం
(మొదటి మూడు నామాలతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః (చేయికడుగుకోవాలి)
విష్ణవే నమః మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః వామనాయ నమః
శ్రీధరాయ నమః హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః దామోదరాయ నమః
సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః
నారసింహాయ నమః అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః
హరయే నమః శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అని పై నామములను స్మరింపవలెను)
శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.
ప్రాణాయామము :
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.
సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీశార్వరీనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే , ద్వాదశి తిధౌ, బృగువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః …..(పేరు చెప్పాలి), గోత్రః ………(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్త్థ్యర్థం, మనోవాంఛా పరిపూర్ణార్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే అధౌనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూజాంాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షింతలు వేసి, లోపల ఒక పుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రము చెప్పుకోవాలి)
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద ఆకుతో లేదా పుష్పంతో చల్లండి.
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః, ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.
ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
పూజ ప్రారంభము
వరలక్ష్మీదేవి ధ్యానం
నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే !!
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ||
అక్షింతలు వేయాలి
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి
దేవి! త్వాం సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః || ధ్యాయామి || ఆవాహయామి
అక్షింతలు వేసి ఆచమనీయం చేయాలి
సూర్యాయుత నిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసన మిదం దేవి స్థీయతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి
రత్నసింహాసనం సమర్పయామి అక్షింతలు వేయాలి.
శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి రాగి/స్టీల్ పల్లేంలో నీళ్ళు వదలాలి
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి అమ్మవారిపై నీళ్ళు చల్లాలి
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి నీళ్ళు చల్లాలి
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి పంచామృతం చల్లాలి
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్స్థితం
శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధు సోదరి
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్ళు చల్లాలి
సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం సమర్పించాలి
కేయూర కంకణే దివ్యేహారనూపుర మేఖలా
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి ఆభరణాలు అమ్మవారికి పెట్టాలి
తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః మాంగల్యం సమర్పయామి అమ్మవారికి మాంగల్యం సమర్పించాలి
కర్పూరాగరు కస్తూరి రోచనాదిభి రన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః గంధం సమర్పయామి గంధం, కుంకుమ పెట్టాలి
అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లాలి
మల్లికా జాజికుసుమైశ్చంప కైరపిర్వకుళైస్తతహా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పుష్పాణి పూజయామి అమ్మవారిని పూవులతో అలంకరించాలి
అమ్మవారికి అథాంగ పూజ:
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమల వాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదన మాత్రే నమః స్తనౌ పూజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాయై నమః శిరః పూజయామి
వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ
(ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)
ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయైనమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః (108)
శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీతర్థ్యం అష్టోతర శతనామావళి సమర్పయామి.
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణత్వం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి
అగరవత్తులు/ధూప్‌స్టిక్ లేదా సాంబ్రాణి వేయండి, వెలిగించండి
ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి
(పూజ ప్రారంభంలోనే వెలిగించి ఉంటుంది కాబట్టి దీపం కుందిలో నూనె లేదా నెయ్యి మరోసారి వేయండి. దీపానికి నమస్కారం చేయండి)
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి పిండి వంటలపై నీళ్ళు చల్లాలి
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి నీళ్ళు చల్లాలి
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
తాంబూలం తమలపాకు, వక్కలు, దక్షిణతో పెట్టండి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గ్ర్హ్యాతాం విష్ణువల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి
కర్పూరం వెలిగించాలి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
మహాదేవ్యైచ విద్మహే, విష్ణుపత్నీచ ధీమహి!
తన్నో లక్ష్మీప్రచోదయాత్ !!
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి.
తర్వాత
చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి
తోరగ్రంధి పూజ:
తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి ఈ విధంగా పూజ చేయాలి
కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి
రమాయై నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి
విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంధిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంధిం పూజయామి
క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంధిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంధిం పూజయామి
చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి
హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి
తోరము కడుతూ కింది శ్లోకం చదవాలి
తోరబంధన మంత్రం:
బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే
వాయన విధి:
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం శ్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే
ముత్తయిదువకు పండ్లు, పూలూ, తాంబూలం శక్తి కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.
వాయనదాన మంత్రం:
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ
ఇందిరాతారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
ఇతి పూజా విధానం సంపూర్ణం.
వరలక్ష్మీ వ్రత కథ :
(కథ ప్రారంభం: ఈ సమయంలో చక్కగా కూర్చుని, అక్షింతలు చేతిలో తీసుకొని, కథను భక్తి శ్రద్దలతో వినాలి)
రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ అసరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.
మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించు చుండెను. త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి “నేను వరలక్ష్మీదేవిని శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక” అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను. చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ అందరు శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను. శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో శుద్ధి చేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా ||
అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగ వాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.
(అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి)
ముత్తైదువులకు వాయనం, పసుపు,కుంకుమలు ఇవ్వాలి. సాయంత్రం పేరింటం అవకాశాన్ని బట్టి ముత్తైదువలకు తాంబూలం, పండ్లు తదితర సుమంగళి పదార్థాలను సమర్పించాలి.
trending tag test