Wednesday, November 29, 2023

Odisha-365
google-add

Janasena: విద్యార్థుల అదృశ్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన

T Ramesh | 18:49 PM, Fri Sep 08, 2023

రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఉన్నతి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవ పరిస్థితికి పూర్తి విరుద్ధమన్నారు. విద్యాశాఖకు సంబంధించిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వే ను ప్రస్తావించిన నాదెండ్ల మనోహర్, ఐదు సంవత్సరాల నుంచి 18 ఏళ్ళ మధ్య ఉన్న విద్యార్థులు 62,754 మంది మరణించారని వెల్లడించారు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ ఆగస్టు వరకూ చోటు చేసుకున్న పరిస్థితులపై నిర్వహించిన సర్వేను ప్రస్తావించిన నాదెండ్ల..  3.88 లక్షల మంది స్కూల్ డ్రాప్  ఔట్స్ ఉండగా, 2.29 లక్షల మంది విద్యార్థులు కనిపించకుండా పోయారన్నారు. ఇప్పుడు తమ పార్టీ వెల్లడిస్తున్న గణాంకాలు తప్పు అని వైసీపీ సర్కార్ చెప్పగలదా? అని ప్రశ్నించారు. విద్యాశాఖ చేయించిన ఈ సర్వేలో  13,676 గ్రామ సచివాలయాల వాలంటీర్లు,  15,004 వార్డు సచివాలయ కార్యాలయాల వాలంటీర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు.

 లక్షల కోట్ల అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ఏ మేరకు దృష్టిపెట్టారని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ఔట్స్ తోపాటు కనిపించడం లేదు అనే కేటగిరీ కూడా ఈ సర్వేలో కనిపించింది. ఇది చాలా విస్తుపోయే కేటగిరీ.. ఆచూకీ లేకుండా కనిపించనివారు అనే కేటగిరీలో 2.29 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

 సర్వే నివేదికలోని ఆచూకీ లేనివారు అనే కేటగిరీ పై తమ పార్టీకి సందేహాలు ఉన్నాయన్న నాదెండ్ల మనోహర్, సదరు విద్యార్థులు కనిపించకుండా ఎలా పోయారు? వారి తల్లితండ్రులు ఎవరు?  అనే వివరాలు వెల్లడించాలని కోరారు. అందులో బాలికలు ఎంతమందో చెప్పాలన్నారు. ఈ అంశంపై విద్యాశాఖ ఏమైనా విచారణ చేపట్టిందో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీ‌ఈ‌ఆర్ సర్వే రిపోర్ట్ వివరాలు బయటపెట్టాలని విద్యార్థుల మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

సంస్కృతి

google-add
google-add