Wednesday, November 29, 2023

Odisha-365
google-add

ALLU ARJUN: లండన్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు బొమ్మ.. వచ్చే ఏడాది విగ్రహావిష్కరణ..!

T Ramesh | 17:21 PM, Tue Sep 19, 2023

టాలీవుడ్ హీరో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ను మరో ప్రతిష్టాత్మక గౌరవం వరించనుంది. ఆయన నటించిన పలు చిత్రాలు విజయవంతం కావడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన సినిమా కెరియర్ లో పుష్ప అత్యుత్తమ చిత్రంగా నిలవగా, ఈ సినిమాలో ఆయన నటనకు గాను  జాతీయ ఉత్తమ అవార్డు పొందారు. ఈ అవార్డు దక్కిన మొట్టమొదటి తెలుగు నటుడిగా రికార్డు నెలకొల్పాడు.

మరో అంతర్జాతీయ గౌరవం కూడా ఆయనకు దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు బొమ్మ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే అధికారికంగా ప్రారంభం కాగా, అల్లు అర్జున్ త్వరలోనే మ్యూజియాన్ని సందర్శించి తన శరీర కొలతలు ఇవ్వనున్నట్లు సమాచారం. టాలీవుడ్ నుంచి ఇప్పటికే ప్రభాస్, మహేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ విగ్రహం వాటి సరసన చేరనుంది.  

పుష్ప-2 చిత్రీకరణలో ఉన్న అల్లు అర్జున్ ఈ వారంలో లండన్ వెళ్ళి విగ్రహానికి అవసరమైన కొలతలు ఇస్తారని సమాచారం. విగ్రహావిష్కరణ వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్ళు చేసిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప-2 ను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

పుష్ప లో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ కనిపించారు. అయితే పుష్ప-2లో మాత్రం గంగమ్మ తల్లి వేషధారణలో అల్లువారి హీరో కనిపించనుండటం విశేషం, దీనికి సంబంధించిన పోస్టర్ ను ఇప్పటికే సినిమా యూనిట్ విడుదల చేసింది. చేతికి నవరత్నాలు పొదిగిన ఉంగరంతో పాటు  నుదుటన పెద్ద బొట్టు, ముక్కు పుడక, మెడలో నిమ్మకాయల దండతో కూడిన అల్లు అర్జున్ పోస్టర్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add