Monday, December 11, 2023

Odisha-365
google-add

AP CM : సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామని జగన్ హామీ

T Ramesh | 14:58 PM, Mon Aug 21, 2023

సీపీఎస్ బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తుందని సీఎం జగన్ తెలిపారు. సీపీఎస్ పై సుదీర్ఘమైన అధ్యయనం చేసి ఎంప్లాయ్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తున్నామని దీనిపై త్వరలో ఆర్డినెన్స్ వస్తుందన్నారు.

విజయవాడలో నిర్వహించిన ఏపీ ఎన్జీవోల బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రభుత్వ వ్యవస్థలు బాగుంటేనే ప్రజలు, ఉద్యోగులు బాగుంటారన్నారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాల కంటే తామే మిన్నగా ఆలోచించామన్నారు.  

ప్రభుత్వంపై భారం పడకుండా ఉద్యోగులు నష్టపోకుండా జీపీఎస్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పెన్షన్ స్కీమ్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే దసరా పండుగ రోజున ఉద్యోగులందరికీ ఒక డీఏ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తామని చెప్పారు.

2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడంతో పాటు 53 వేలమంది ఆరోగ్యరంగంలో నియమించామని సీఎం వివరించారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తమది ప్రజా ప్రభుత్వమని తెలిపిన జగన్.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు వారధులని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన కారుణ్య నియామకాల్లోనూ పారదర్శకత పాటించామని పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో వెనక్కి తగ్గలేదని చెప్పారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించి కార్మికులకు తోడుగా ఉన్నామన్న జగన్.. ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేశామని చెప్పారు. గత ప్రభుత్వాలు పక్కన పడేసిన అనేక సమస్యలకు తమ హయాంలో పరిష్కారం చూపామన్నారు.  

google-add
google-add
google-add
google-add

సంస్కృతి

google-add
google-add