Wednesday, November 29, 2023

Odisha-365
google-add

Weather Report: తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన..

T Ramesh | 10:41 AM, Mon Sep 18, 2023

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 19న బలపడి ఆల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వీతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో  అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. మరో వైపు పగటి పూట ఎండతీవ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

సంస్కృతి

google-add
google-add