Wednesday, November 29, 2023

Odisha-365
google-add

AP Cabinet Meeting: మరికాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

P Phaneendra | 09:52 AM, Wed Sep 20, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రేపటి నుంచీ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ్టి క్యాబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రేపటినుంచి జరగబోయే వర్షాకాల సమావేశాల నిర్వహణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల గురించి చర్చ జరుగుతుందని సమాచారం.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనపై మరిన్ని కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆ కేసుల విషయంలో తదుపరి తీసుకోబోయే చర్యల గురించి కూడా చర్చించే అవకాశముంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న మొదటి క్యాబినెట్ సమావేశం కావడంతో ఆ అంశంపై తప్పకుండా చర్చిస్తారని సమాచారం.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

సంస్కృతి

google-add
google-add