Saturday, September 23, 2023

Odisha-365
google-add

‘భారత్’ గురించి డా. మోహన్ భాగవత్ ఏం చెప్పారంటే...

P Phaneendra | 12:34 PM, Wed Sep 06, 2023

మన దేశం పేరును దేశాధినేతలు ‘భారత్’గా వ్యవహరిస్తుండడంపై కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు రచ్చ చేస్తున్నాయి. అయితే, మన దేశం మొదటినుంచీ భారతదేశమే. మధ్యలో వచ్చిన ఆంగ్లేయులు మన మీద కుట్రపూరితంగా రుద్దిన బానిస భావజాల పదం ఇండియా. నిజానికి మనం మన దేశాన్ని మనం పెట్టుకున్న సొంత పేరుతోనే పిలవాలి తప్ప ఎవరో మన మీద రుద్దిన విదేశీ పేరుతో పిలుచుకోవడం అవమానకరం. ఈ విషయమై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఏం చెప్పారంటే....

‘‘మన దేశం పేరు ఇండియా కాదు, భారత్ అని ఉండాలి. మనందం ఇండియా అనే పదాన్ని వాడడం వదిలేయాలి, భారత్ అనే పేరును వాడడం మొదలుపెట్టాలి. అప్పుడప్పుడూ ఇంగ్లీషు మాత్రమే తెలిసినవారితో మాట్లాడవలసి వస్తుంది. అలాంటప్పుడు వారికి అర్ధమయ్యేలా మాట్లాడాలి అనుకుని ఇండియా అని వాడుకలో అనేస్తాం. అలాంటి అవసరం ఏమీ లేదు. ప్రత్యేకమైన పేర్లకు భాషాంతరీకరణ ఉండదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక వ్యక్తి పేరు గోపాల్ అనుకోండి. ఆంగ్లేయులతో ఆ పేరు చెప్పాల్సి వస్తే ‘కౌ హెర్డర్’ అని మార్చి చెప్పము కదా. గోపాల్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అతని పేరు గోపాల్‌గానే ఉంటుంది. అక్కడ వారిభాషలో గో అంటే ఏంటి, పాలకుడు అంటే ఏంటి అని అర్ధాలు వెతికి పిలవరు కదా. అలాగే మన దేశం పేరు కూడా. తరతరాలుగా మన దేశం పేరు భారతదేశం. ‘‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ’’ అనే భావంలో ప్రయాణిస్తుండే దేశం, ప్రకాశం వైపు పయనించే దేశం, జ్ఞానం పట్ల మక్కువ కలిగి ఉండే దేశం, అలాంటి మనదేశం పేరు భారత్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దానిపేరు భారత్ అనే ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు మన దేశాన్ని భారత్ అనే వ్యవహరిద్దాం. ఎవరికైనా అర్ధం కాకపోతే కంగారు పడకండి. వారికి అవసరమైతే వారే అర్ధం తెలుసుకుంటారు.’’

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

రాజకీయం