తిరుమల
తిరుపతి దేవస్థాన పాలకమండలి తీరును బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ
తప్పుబట్టారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ తిరుమలను ధార్మిక ధనార్జన క్షేత్రంగా
మార్చే కుట్రకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
తిరుపతి
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీటీడీ వార్షిక బడ్జెట్ నుంచి ఒక శాతం ఇవ్వలన్న నిర్ణయాన్ని ్ని ఆమె తప్పుబట్టారు.
చట్టంలో లేకుండా సొంత నిర్ణయాలు ఎలా
తీసుకుంటారని ప్రశ్నించారు.
స్మార్ట్
సిటీ పథకంలో భాగంగా తిరుపతి అభివృద్ధికి కేంద్రం
మంజూరు చేసిన నిధులతో పాటు పన్ను ఆదాయం ఏమవుతోందని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వమే
టీటీడీకి ఇవ్వాల్సింది పోయి, దేవుడి సొమ్మును తీసుకోవడమేంటని నిలదీశారు.
రాష్ట్రంలోని మిగతా దేవాలయాల్లో కూడా ఇదే తరహా విధానం పాటిస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.
తుడాను
కబ్జా చేసిన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ నిధులపై కుట్ర చేస్తున్నారని
ఆరోపించిన యామినీ శర్మ,
ధార్మిక కార్యక్రమాలు జరగకుండా, హిందువులను దేవాలయాలకు దూరం చేయడం అన్యాయమని ఆవేదన
చెందారు.
మసీదులు, చర్చ్
ల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం, ఉద్యోగుల
జీతాలకోసం అడిగే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.