Monday, December 11, 2023

Odisha-365
google-add

IOC member john coats : భారత్ కు ఆ సత్తా ఉంది

Editor | 14:36 PM, Sun Oct 15, 2023

ఒలింపిక్స్ నిర్వహణలో భారత్ కు అవకాశాలున్నట్లు ఆశిస్తున్నామని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సభ్యుడు జాన్ కోట్స్ అభిప్రాయపడ్డారు. ముంబైలో ఈనెల 14న అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 141వ సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసింది. మూడురోజుల పాటు జరగనున్న సెషన్లో భాగంగా ఈరోజు జాన్ కోట్స్ మీడియాతో మాట్లాడారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ఉన్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. తదుపరి ఒలింపిక్స్ జరిగే అవకాశాలు భారత్ కు ఉన్నాయని కోట్స్ తెలిపారు. విభిన్న వేదికలు, ప్రణాళికలను కలిగిన దేశాలకు తమ నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహముంటుందన్నారు. 141వ ఐఓసీ సెషన్‌ కు భారత్ ఆతిథ్యమివ్వడం అమోఘమన్నారు. భారతీయ క్రీడలకు ఇదో సముచిత గుర్తింపని జాన్ కోట్ అభివర్ణించారు. ఐఓసీ సెషన్స్ ప్రారంభం రోజైన నిన్న ప్రధాని నరేంద్రమోదీ 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాన్ కోట్స్ చేసిన వ్యాఖ్యలతో ఆ విషయానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add