Monday, December 11, 2023

Odisha-365
google-add

BRITISH POLICEWOMAN RAPED NEAR EIFFEL TOWER: ఈఫిల్ టవర్ వద్ద మహిళా పోలీసుపై అత్యాచారం

T Ramesh | 15:56 PM, Wed Oct 18, 2023

బ్రిటిష్ పోలీస్ అధికారిణి ఫ్రాన్స్‌లో అత్యాచారానికి గురైంది.  ఈఫిల్ టవర్ సమీపంలోని నైఫ్ పాయింట్ వద్ద ఆమెపై ఓ దుండుగుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. 23 ఏళ్ల పోలీసు అధికారిణి, స్నేహితులతో కలిసి ఈఫిల్ టవర్ ను వీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.

సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమెపై ఓ వ్యక్తి బలత్కారానికి పాల్పడినట్లు కేసు నమోదు అయింది. బాధితురాలు పొదల చాటున ఉన్న టాయిలెట్ కు వెళ్ళగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమెపై దూకాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంగా చేయగా కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ 35 ఏళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మూడు నెలల కిందట కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. 27 ఏళ్ళ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే అనుమానంపై అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులు వెంటనే విడుదలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు లో కూడా అదే ప్రాంతంలో ఓ మహిళ కిటికీ తెరిచి నిద్రిస్తుండగా ఓ అగంతకుడు జోరబడి కత్తితో బెదిరించి బలత్కారం చేసినట్లు కూడా కేసు నమోదైంది.

ఫ్రాన్స్ లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఓ ఉపాధ్యాయిని కూడా ఇలాంటి ఘటననే ఎదుర్కున్నారు. దీంతో 7 వేలమంది అదనపు పోలీసు సిబ్బందిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

బిట్ కాయిన్ దూకుడు

K Venkateswara Rao | 12:23 PM, Thu Dec 07, 2023

మరో కీలక ఉగ్రవాది హతం

K Venkateswara Rao | 10:28 AM, Thu Dec 07, 2023

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add