వినాయక నిమజ్జనం సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన గొడవలో కానిస్టేబుల్ గంధం నరేంద్రపై ఓ యువకుడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ నరేంద్ర ఇవాళ మృతి చెందారు. పోస్ట్ మార్టమ్ కోసం నరేంద్ర మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనంలో డీజే ఆపాలని కానిస్టేబుల్ కోరారు. దీంతో ఓ యువకుడు కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న ఆగిరిపల్లి ఎస్ఐ, గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించాడు. కర్రతో దాడికి దిగడంతో కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నట్టు గుర్తించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అపోలోకు తీసుకెళ్లినా నరేంద్ర ప్రాణాలు దక్కలేదు.