Thursday, November 30, 2023

Odisha-365
google-add

Harish salve:  మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే  మూడో పెళ్ళి ..!

T Ramesh | 14:41 PM, Mon Sep 04, 2023

మాజీ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే ముచ్చటగా మూడో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. త్రినా అనే మహిళను లండన్ లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహమాడిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

దేశంలోని న్యాయకోవిదుల్లో ఒకరైన హరీశ్ సాల్వే, మొదట మీనాక్షి అనే మహిళను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమార్తులున్నారు.  పెళ్ళైన38 ఏళ్ళ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన  హరీశ్ సాల్వే, 2020లో కరోలిన్ బ్రోస్సార్డును వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సాల్వే మూడో పెళ్ళి చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ,నీతా అంబానీతో పాటు సునిల్ మిట్టల్, లక్ష్మీనివాస్ మిట్టల్, ఎస్పీ లోహియా, గోపి హిందూజా ఈ వేడుకకు హాజరయ్యారు. పలు హై ప్రొఫైల్ కేసుల్లో వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే, గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైల్లో మగ్గుతున్న కుల్ భూషణ్ జాదవ్ తరఫున వాదించారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే ఈ కేసు తరఫునా వకాల్తా తీసుకున్నారు. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ వంటీ కంపెనీల తరఫున కూడా పలు కేసుల్లో వాదనలు వినిపించారు.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హింట్ అండ్ రన్ కేసు నుంచి బయటపడేశారు. కావేరీ జలవివాదం కేసులో కేంద్రప్రభుత్వం తరఫున వాదించారు. కృష్ణా, గోదావరి బేసిన్ గ్యాస్ వివాదానికి సంబంధించిన కేసు వాదనల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. 1999 నుంచి 2002 వరకు భారత సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారు.

న్యాయవ్యవస్థలో ఆయన అందించిన సేవలకు గానూ 2015ల కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలోనూ హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

మూడో విడత బందీల విడుదల

K Venkateswara Rao | 10:33 AM, Mon Nov 27, 2023

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023