Saturday, September 23, 2023

Odisha-365
google-add

Jaahnavi Kandula: ఆమె మరణిస్తే ఎందుకు నవ్వానంటే... సియాటెల్‌ పోలీస్ వివరణ

P Phaneendra | 18:32 PM, Sat Sep 16, 2023

ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని చనిపోయింది. ఆమె మరణం గురించి పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఇటీవల వైరల్‌ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఆమె మరణానికి విలువ లేదు’ అన్నట్లు ఆయన మాట్లాడటం దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. భారత్‌ కూడా ఆ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసింది.

తాజాగా ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల సంఘం ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్‌ అయిన దృశ్యాలు బాడీక్యామ్‌ వీడియో రికార్డ్‌ చేసినవి. ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్‌ వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్‌ రాసిన లేఖను కూడా గిల్డ్‌ విడుదల చేసింది.

‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్‌ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. బాడీక్యామ్‌ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్‌ అయ్యింది. అయితే, నేను కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్‌ తన లేఖలో వివరించారు. అంతేతప్పబాధితురాలిని అవమానించేలా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా తాను సిద్ధమేనని డేనియల్ తెలిపారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

google-add

రాజకీయం

google-add
google-add
google-add

బ్లాగ్

google-add
google-add