ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ (hamas israel seize fire) తాత్కాలిక సంధిలో భాగంగా ఇరువర్గాలు మూడో విడత బందీలను విడుదల చేశాయి. శని,ఆదివారాల్లో 26 మంది ఇజ్రాయెలీలతోపాటు, 8 మంది విదేశీయులను హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 75 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. హమాస్ నుంచి విడుదలైన బందీలు ఆదివారం తెల్లవారుజామున వెస్ట్‌బ్యాంక్ చేరుకున్నారు. రెండో విడతలో విడుదలైన బందీలు ఇప్పటికే ఈజిప్టు, ఇజ్రాయెల్ చేరుకున్నారు.
రెండో విడతలో విడుదలైన బందీల్లో ఆరుగులు మహిళలు, ఏడుగులు పిల్లలున్నారు. మూడో విడతలో 14 మంది ఇజ్రాయెలీలతోపాటు, ముగ్గురు విదేశీయులున్నారు. వీరిలో కొందరు ఈజిప్టునకు వెళ్లారు. మిగిలిన వారిని హమాస్ ఉగ్రవాదులు రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు. సోమవారం నాలుగో విడత బందీలను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు హమాస్ 59 మందిని, ఇజ్రాయెల్ 114 మందిని విడుదల చేశాయి.