అమెరికాకు చెందిన ఆర్థిక చరిత్రకారిణి క్లాడియా
గోల్డిన్ ఈ యేడాది నోబెల్ ఎకనామిక్స్ అవార్డు గెలుచుకున్నారు. మహిళల లేబర్
మార్కెట్ ఫలితాలను అర్ధం చేసుకునే అధ్యయనానికి గాను ఆమెకు ఈ పురస్కారం లభించినట్లు
స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ పురస్కారంతో ఈ యేడాది నోబెల్
బహుమతుల ప్రకటన పూర్తయింది.
నోబెల్ బహుమతుల్లో అర్ధశాస్త్రానికి పురస్కారం
మొదట్లో లేదు. గతంలో ఈ పురస్కారాన్ని స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్‌గా పేర్కొనేవారు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ అవార్డులను మొదలుపెట్టినప్పుడు సైన్స్, సాహిత్యం, శాంతి
అనే మూడు విభాగాల్లో మాత్రమే ఇచ్చేవారు. 1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ నిధులు
సమకూర్చడం మొదలయ్యాక ఆర్థిక శాస్త్రానికి కూడా నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేయడం
మొదలైంది. అలా, మొదటి అవార్డును 1969లో ప్రదానం చేసారు.
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆలోచనాపరులు,
మేధోజీవులు, విద్యావేత్తలు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఫ్రెడరిక్ ఆగస్ట్ వాన్
హేయక్, మిల్టన్ ఫ్రెడ్‌మ్యాన్ వంటివారి నుంచి ఇటీవల కొన్నాళ్ళ క్రితం పాల్ క్రుగ్‌మ్యాన్
వంటి వారు ఆర్థిక పురస్కారాలు అందుకున్నారు. గతేడాది అమెరికాకు చెందిన ముగ్గురు
ఆర్థికవేత్తలు ఈ ప్రైజ్ అందుకున్నారు.