Thursday, November 30, 2023

Odisha-365
google-add

భారత్‌లోకి ప్రవేశించిన మయన్మార్ సైనికులు

K Venkateswara Rao | 13:48 PM, Mon Nov 20, 2023

ఉగ్రదాడుల నుంచి తప్పించుకునేందుకు మయన్మార్‌కు (Myanmar Terror Attacks) చెందిన 29 మంది ఆ దేశ సైనికులు మిజోరంలోకి ప్రవేశించినట్లు ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. గత కొద్ది రోజులుగా మయన్మార్ సైన్యానికి, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పీడీఎఫ్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు మయన్మార్ సైనికులు మరోసారి భారత్‌లోకి ప్రవేశించారు.

నవంబరు 16న మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంలో సైనిక క్యాంపుపై పీడీఎఫ్ మద్దతుదారులు ఉగ్రదాడులకు దిగారు. దీంతో 29 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి ప్రవేశించారు. అంతర్జాతీయ సరిహద్దుల గుండా వారు వారు మిజోరంలోకి వచ్చినట్లు భారత్ ప్రకటించింది. స్థానిక పోలీసులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది వారిని గుర్తించి మణిపుర్‌లోని మోరేకు విమానంలో తరలించారు. అక్కడి నుంచి మణిపుర్ సరిహద్దులోని మయన్మార్‌కు చేరుకుంటారని భారత్‌కు చెందిన ఓ సైన్యాధికారి ప్రకటించారు.

గతంలో కూడా 45 మంది మయన్నార్ సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించగా వారిని వెనక్కు పంపారు. మయన్నార్ సరిహద్దులో పరిస్థితి అదుపులోనే ఉందని సైన్యం ప్రకటించింది. మయన్మార్ ఘర్షణల కారణంగా ఫిబ్రవరి 21 నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది మిజోరంకు చేరుకున్నారు. వారికి శరణార్ధుల శిబిరాల్లో భారత్ ఆశ్రయం కల్పిస్తోంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం