Thursday, November 30, 2023

Odisha-365
google-add

ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు

K Venkateswara Rao | 12:21 PM, Sun Nov 12, 2023

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం (israel hamas war) మొదలైన తరవాత మొదటిసారి భారత్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యాకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా... 18 దేశాలు తటస్థ వైఖరి పాటించాయి. హంగేరి, కెనడా, ఇజ్రాయెల్ మార్షల్‌ఐలాండ్స్, ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి.

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ గౌర్హాజరైంది. హమాస్ దాడులను భారత్ ఖండించింది. ఇజ్రాయెల్ గాజా యుద్దం మొదలైనప్పటి నుంచి 11078 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, వేలాది మంది గాయపడ్డారని ఐరాస వెల్లడించింది. హమాస్ ప్రధాన స్థావరంగా అనుమానిస్తోన్న అల్‌షఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం