Thursday, November 30, 2023

Odisha-365
google-add

హౌతీ రెబల్స్ దుశ్చర్య: భారత్‌కు రావాల్సిన నౌక హైజాక్

T Ramesh | 10:44 AM, Mon Nov 20, 2023

యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ తమ దేశం నుంచి వెళుతున్న నౌకను హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎర్ర సముద్రం వేదికగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన కారణంగా హమాస్‌తో సాగుతున్న వైరం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బందితో తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఈ కార్గో నౌకను హౌతీ రెబల్స్ హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని  కార్యాలయం ప్రకటించింది. హైజాక్‌కు గురైన నౌకలో భారతీయులు, ఇజ్రాయెలీలెవరూ లేరని పేర్కొంది.  బ్రిటీష్ కంపెనీకి చెందిన ఈ నౌకను జపాన్ సంస్థ నిర్వహిస్తోందని, ఇరాన్ మార్గదర్శకత్వంతో  హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని తెలిపింది.

కార్గోషిప్‌ను యెమెన్ తీరానికి తీసుకెళ్లామని హౌతీ రెబల్స్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నౌక ఇజ్రాయెల్‌కు చెందింది కాకపోయినప్పటికీ  ఆ దేశ వ్యాపారవేత్త అబ్రహం ఉంగార్‌కు తాత్కాలిక యజమానిగా ఉన్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం