Thursday, November 30, 2023

Odisha-365
google-add

చాట్ జీపీటీ  సీఈవోకు ఉద్వాసన పలికిన బోర్డు

T Ramesh | 10:50 AM, Sat Nov 18, 2023

విశ్వాసం కోల్పోయాడంటూ చాట్ జీపీటీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌(ChatGPT Open AI CEO Sam Altman )ను  ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరక్టర్స్ తొలగించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలిపారు. అతడి స్థానంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న  మీరా మురాటి(Mira Murati) తాత్కాలిక సీఈవో(interim CEO)గా బాధ్యతలు చేపడతారని కంపెనీ పేర్కొంది.

పరిశోధన, ఉత్పత్తి, భద్రత విభాగాలకు  ప్రస్తుతం అధిపతిగా ఉన్న మీరాకు వృత్తిపరంగా సుదీర్ఘ అనుభవం ఉంది. శుక్రవారం సమావేశమైన ఓపెన్ ఏఐ సంస్థ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డుతో జరుగుతున్న చర్చల్లో ఆల్ట్‌మన్ నిజాయితీ పాటించడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడని, అతడి సామర్థ్యంపై నమ్మకం లేదు అని బోర్డు పేర్కొంది. తక్షణమే తమ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

తన తొలగింపుపై ఆల్ట్‌మన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐలో పనిచేయడాన్ని తాను ఎంతో ఇష్టపడతానన్నారు. ప్రతిభావంతులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తానన్న ఆల్ట్‌మన్, 8 ఏళ్ళ కిందట తన అపార్టుమెంటులో తామందరం కలిసి నిర్మించిన దాని గురించి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.

మిస్సౌరీలో జన్మించిన స్టాన్‌ఫోర్డ్ డ్రాపౌట్ అయిన ఆల్ట్‌మన్ గతేడాది విడుదల చేసిన చాట్‌జీపీటీ తో విపరీతమైన స్టార్‌డమ్ సంపాదించారు. టెక్ దిగ్గజం ఓపెన్ ఏఐ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఈ సాంకేతికతను మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ఇంజిన్ లో వినియోగిస్తోంది.

శామ్ ఆల్ట్‌మన్ సీఈవో బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలో ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆల్టమన్ ను తొలగించిన కారణంగానే తాను కూడా కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు గ్రెగ్ తెలిపారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం