Thursday, November 30, 2023

Odisha-365
google-add

శ్రీలంకను వణికించిన భూకంపం : జనం పరుగులు

K Venkateswara Rao | 16:00 PM, Tue Nov 14, 2023

శ్రీలంక రాజధాని కొలంబోను తీవ్ర భూకంపం (earth quake) వణికించింది. రిక్టరు స్కేలుపై 6.2గా తీవ్రత నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించింది. జనం భయంతో ఇళ్లు వదలి పరుగులు పెట్టారు. భూకంపం తీవ్రతకు అనేక ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని స్థానిక మీడియా తెలిపింది. రాజధాని కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లినట్లు వార్తలు అందలేదు. పెద్దగా నష్టం వాటిల్లలేదని అమెరికా జియోలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో వెల్లడించింది.

మన దేశంలోని లద్దాఖ్‌లోనూ భూమి స్వల్పంగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు భూమి కంపించినట్లు స్థానిక వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. కార్గిల్‌కు వాయువ్య దిశలో 314 కి.మీ దూరంలో 20.కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం