Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 4: జాతీయ దృష్టికోణం

param by param
May 12, 2024, 01:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Dr B R Ambedkar Biography : Part 4

(అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా
ప్రత్యేక వ్యాస పరంపర)

ముస్లిం సంతుష్టీకరణకు
విరోధం: డాక్టర్ అంబేడ్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశంలో ఎవరికీ
అన్యాయం జరగకూడదు. అదే సమయంలో ఎవరినీ సంతుష్టీకరణ చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ
సహించకూడదు. ముస్లిముల డిమాండ్లు నానాటికీ పెరిగిపోతుండడం, వారిముందు సాగిలపడిపోయే
కాంగ్రెస్ ధోరణి దేశానికి హానికరం. ముస్లిములకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా
గాంధీ, కాంగ్రెస్ వారిని సంతుష్టీకరించే పద్ధతి అవలంబించారు. అంబేడ్కర్ ముందున్న
ప్రశ్న సమాజంలో వెనుకబడిన వర్గాల ఉద్ధరణ. ఒకవైపు పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని
అడుగుతూనే అత్యధిక అధికారాల కోసం పట్టుపడుతున్న ముస్లిములు, మరోవైపు కాంగ్రెస్
వివాదాస్పద చరిత్ర. ముస్లిం సంతుష్టీకరణ విధానానికి వ్యతిరేకి ఐనందున అంబేడ్కర్,
ముస్లిములకు విధానసభల్లో సీట్ల రిజర్వేషన్ విధానాన్ని మొదటిసారి ఇచ్చిన లక్నో ఒప్పందాన్నీ,
నెహ్రూ కమిటీ నివేదికనూ తీవ్రంగా వ్యతిరేకించాడు.

1929 జనవరి 19న ‘బహిష్కృత
భారత్’ పత్రికకు రాసిన లేఖలో అంబేడ్కర్ ఇలా రాసాడు, ‘‘ఏ ప్రణాళిక వల్ల హిందువులకు
కీడు కలుగుతుందో అలాంటి ప్రణాళిక ఎందుకు పనికొస్తుంది? ఆ నివేదికను మేం
వ్యతిరేకిస్తున్నది దేనికంటే అస్పృశ్యుల అధికారాలను హరిస్తున్నందుకు మాత్రమే కాదు,
ఆ నివేదిక వల్ల హిందువులకు ప్రమాదం వాటిల్లుతుంది, దానివల్ల మొత్తం హిందుస్తాన్
భవిష్యత్తులో కష్టాల పాలవుతుంది. అందువల్లే ఆ నివేదికను మేం వ్యతిరేకిస్తున్నాం.’’

దేశ భద్రత విషయంలో:
1857 విప్లవం తర్వాత సైన్యంలో క్రమక్రమంగా ముస్లిముల శాతం పెరుగుతూ వచ్చింది. ఆ
విషయంపై అంబేడ్కర్ తీవ్ర ఆందోళన చెందాడు. భారత సైన్యంలో ముస్లిముల సంఖ్య పెరుగుతుండడంపై
ఆయన విశ్లేషణ ఇలా ఉంది, ‘‘ఇవాళ భారత సైన్యంలో ముస్లిములు సంఖ్య గణనీయంగా ఉంది.
వారిలో అత్యధికులు దేశ వాయవ్య ప్రాంతానికి చెందినవారు. భారతదేశాన్ని ఆక్రమణల నుంచి
రక్షించడానికి భారతీయులకు మాత్రమే బాధ్యత అప్పగించాలి. దేశాన్ని బానిసత్వం నుంచి
విముక్తం చేయడానికి హిందువులు ఎంతకాలం ఈ పహరాదారులపై ఆధారపడతారు?’’ (థాట్ ఆన్
పాకిస్తాన్ పుస్తకంలో)

అప్పట్లో భారత
సరిహద్దుల్లో పెద్ద ముస్లిం దేశం అఫ్గానిస్తాన్ ఉండేది. ముస్లిముల మానసిక
ప్రవృత్తిని గుర్తించిన అంబేడ్కర్ ఇలా రాసారు ‘‘అఫ్గానిస్తాన్ స్వయంగా కానీ, ఇతర
ముస్లిం దేశాలతో కానీ కలిసి భారతదేశంపై దాడికి దిగితే, ఈ ముస్లిం సైనికులు ఏం
చేస్తారు? వీరు వారిని ప్రతిఘటిస్తారా లేక దేశంలోకి దారులు తెరిచిపెడతారా? ఈ ప్రశ్న
విషయంలో ఏ హిందువూ ప్రశాంతంగా, నిర్వికారంగా ఉండలేడు. ప్రతీ హిందువుకూ ఈ ప్రశ్నకు
సంతోషకరమైన జవాబు కావాలి. ముస్లిములు తమ మాతృభూమి పట్ల విధేయంగా ఉంటారా లేక ఇమాముల
పిలుపు మేరకు మరో దారిని ఎంచుకుంటారా?’’ (థాట్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో)

‘‘ప్రశ్న అదే. దేశ భద్రత
విషయంలో అలాంటి సైన్యం పట్ల మనం భరోసా కలిగి ఉండగలమా? ముస్లిములు హిందువులను
కాఫిర్లుగా భావిస్తారు. హిందువులను రక్షించాలన్న భావనను తొలగించివేయడమే వారి
ఉద్దేశంలో శ్రేయస్కరమైన మార్గం. హిందూ అధికారుల అధీనంలో ఉన్నప్పటికీ ముస్లిముల ఈ
రెజిమెంట్ ఎలా పని చేస్తుందన్నది అనుమానాస్పదమే.’’ అంబేడ్కర్ 1919ని గుర్తు
చేసుకుంటూ ఇంకా ఇలా రాసాడు ‘‘గుర్తు చేసుకోండి. ఖిలాఫత్ ఉద్యమం జరుగుతున్న సమయంలో
భారతదేశపు ముస్లిములు అఫ్గానిస్తాన్ అమీరులను మా దేశాన్ని ఆక్రమించుకోండని  ఆహ్వానించారు.’’ (థాట్ ఆన్ పాకిస్తాన్
పుస్తకంలో)

ఖిలాఫత్ ఉద్యమానికి
వ్యతిరేకం: టర్కీలో ఖలీఫా (ఇస్లామిక్ పరిపాలన) ముగిసిపోడానికి వ్యతిరేకంగా,
భారతదేశంలో కాంగ్రెస్ ఉద్యమం చేసింది. నిజానికి భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం
చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అదే సమయంలో దేశానికి సంబంధించిన మతపరమైన విషయాల మీద
మొత్తం దేశాన్ని పణంగా పెట్టడం కాంగ్రెస్ తీసుకున్న అతిపెద్ద మూర్ఖపు చర్య. ఆ
విషయంలో అంబేడ్కర్ అభిప్రాయాన్ని మధు లిమయే ఇలా రాసాడు, ‘‘ఖిలాఫత్ ఉద్యమం మీద
డాక్టర్ అంబేద్కర్‌కు ఎలాంటి సానుభూతీ లేదు. ఈ విషయంలో గాంధీ ప్రవర్తన గురించి అంబేడ్కర్
ఏమనుకున్నారంటే గాంధీ ఆ ఉద్యమానికి కేవలం సమర్థన మాత్రమే ఇవ్వలేదు. వారికి
మిత్రులు, మార్గదర్శకులుగా కూడా నిలిచారు. గాంధీ ఉద్దేశంలో సుల్తాన్ ఖలీఫాను
అనుసరించకూడదని టర్కీవాసులపై ఒత్తిడి చేయడం ఎంతమాత్రం సరైనది కాదు.’’  (డా. బీఆర్ అంబేడ్కర్ – ఏక్ చింతన్ : మధు లిమయే)

బొంబాయి నుంచి సింధ్‌ను
విడదీయడానికి వ్యతిరేకం: ముస్లిం నాయకులు అడిగారన్న ఒకేఒక కారణంతో బొంబాయి ప్రాంతం
నుంచి ముస్లిములు ఎక్కువగా ఉండే సింధ్‌ను విడదీసి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు
చేయడాన్ని అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పట్లో దేశంలో ముస్లిం ప్రాంతాలను
పెంచాలని ముస్లిం నాయకులు ఒత్తిడి చేస్తుండేవారు. శాసనసభల్లో ముస్లిములకు
రిజర్వేషన్ల విషయంలో అంబేడ్కర్ ‘‘ఏకపక్ష ఎన్నికలు, మతపరమైన సంరక్షణలు ప్రజాస్వామ్యానికి
నష్టం కలిగిస్తాయి’’ అని స్పష్టంగా చెప్పాడు. (డా. బీఆర్ అంబేడ్కర్ – వ్యక్తిత్వ్ ఏవం
కృతిత్వ్ : 116వ పుట, రచన డా. డీఆర్ జాతవ్)

‘‘ముస్లింలీగ్ మతపరమైన
విధానాలను జాతీయ దృష్టికోణంలో అంబేడ్కర్ ఎంత వ్యతిరేకించారంటే కాంగ్రెస్ అంతగా
ఎప్పుడూ వ్యతిరేకించలేదు’’ (డా. బీఆర్ అంబేడ్కర్ – వ్యక్తిత్వ్ ఏవం కృతిత్వ్ : 116వ
పుట, రచన డా. డీఆర్ జాతవ్)

ముస్లిం నాయకులు,
ముస్లింలీగ్ పార్టీ దేశంలోని శాసనసభ, పార్లమెంటు స్థానాల్లో ముస్లింలకు
రిజర్వేషన్లు కావాలంటూ చేసిన డిమాండ్లను కాంగ్రెస్ సమర్థించింది. బ్రిటిష్ వారు
కూడా ఆ డిమాండ్‌ను అంగీకరించారు. ముస్లిం నేతలు మెల్లమెల్లగా తమ డిమాండ్లను
పెంచుతూ పోయారు. చివరికి ఒకరోజు దేశాన్ని విభజించాలని కూడా డిమాండ్ చేసారు. దాంతో
దేశం ముక్కలైపోయింది. అంబేడ్కర్ చెప్పిన మాట నిజమని నిరూపితమైంది.

అల్పసంఖ్యాకులు కూడా
దేశం అఖండత గురించి ఆలోచించాలి: అంబేడ్కర్ ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ‘‘ఈ దేశం
వేర్వేరు జాతులు, మార్గాలుగా విడిపోయి ఉంది. అల్పసంఖ్యాకుల రక్షణకు అవసరమైన రాజ్యాంగ
ఏర్పాటు చేయకుండా ఒక సంఘం స్వయంపాలిత సమాజంగా నిలబడలేదు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి
అభ్యంతరమూ ఉండదు. కానీ అల్పసంఖ్యాకులు కూడా ఒక విషయాన్ని ధ్యాసలో ఉంచుకోవాలి. మనం
వేర్వేరు జాతులకు వేర్వేరు మార్గాలకు చెందినవారిగా విడివిడిగా ఉండి ఉండవచ్చు, కానీ
మన లక్ష్యం అఖండ భారతదేశమే కావాలి. ఆ లక్ష్యానికి బాధ కలిగించే ఎలాంటి డిమాండ్‌నైనా
అల్పసంఖ్యాకులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు’’ అని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పాడు.

విభజన సమయంలో దళితులపై
ముస్లిముల అత్యాచారాలకు బాధపడిన అంబేడ్కర్: భారతదేశం విభజనకు గురైంది. పాకిస్తాన్
ప్రత్యేక దేశంగా ఏర్పడింది. హైదరాబాద్ పాలకుడు నిజాం భారతదేశంలో విలీనమవకూడదని
భావించాడు. ఆ సమయంలో పాకిస్తాన్‌లోనూ, హైదరాబాద్‌ సంస్థానంలోనూ దళితులు,
అస్పృశ్యుల పట్ల జరిగిన భయంకరమైన అత్యాచారాల సమాచారం అంబేద్కర్‌కు అందుతుండేది.

పాకిస్తాన్‌లో దళితుల
మీద ముస్లిములు పాల్పడిన అత్యాచారాలను విన్న అంబేడ్కర్ గుండె మండిపోయింది. ఆయన
ఆనాటి పత్రికలలో బహిరంగంగా ఇలా రాసాడు. ‘‘బలవంతంగా ముస్లిములుగా మార్చడం నుంచి
తప్పించుకోడానికి మీరు ఎలా వీలైతే అలా భారతదేశానికి వచ్చేయండి. ముస్లిములకు సవర్ణ
హిందువులంటే కోపం అని భావించి వారిని నమ్మకండి, వారిమీద భరోసా పెట్టుకోకండి. అలా
చేస్తే మీరు అతిపెద్ద తప్పు చేసినట్లే.’’

పాకిస్తాన్‌లోనూ,
హైదరాబాద్‌లోనూ హిందువులను బలవంతంగా ముస్లిములుగా మార్చేస్తున్నారు. అలా తమ జనాభా
పెంచుకుంటున్నారు. అంబేడ్కర్ తన ప్రకటనల్లో హైదరాబాద్ నిజామును భారతదేశ శత్రువుగా
అభివర్ణించాడు. నిజాముకు ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలవవద్దని దళితులకు
మార్గనిర్దేశనం చేసాడు. ఎక్కడెక్కడ హిందువులు ఉండిపోయారో వారిని అక్కడినుంచి
తరలించడానికి తక్షణం ఏర్పాట్లు చేయాలని అంబేడ్కర్ ఆనాటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్
నెహ్రూకు చెప్పాడు. ఆ విషయాన్ని పత్రికలు కూడా ఘనంగా ప్రకటించి, సమర్థించాయి. (డా.
భీమ్‌రావ్ అంబేడ్కర్ : పుటలు 339-350, రచన డా. బ్రిజ్‌లాల్)

అఖండ భారతమే సత్యం: ‘‘ఇవాళ
మనం రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా వేర్వేరు శిబిరాలుగా విడిపోయి
ఉండవచ్చు. కానీ వేర్వేరు జాతులు, మార్గాలకు చెందినప్పటికీ మనమంతా ఒకే దేశంగా
నిలబడగలమని నాకు పూర్తి నమ్మకముంది. దేశ విభజన కోరుతున్న ముస్లింలీగ్ కూడా తమ మేలు
అఖండ హిందుస్తాన్‌లోనే ఉందన్న సంగతిని అర్ధం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది.’’

ఇస్లామిక్ సోదరభావం
ప్రపంచ సోదరభావం కాదు:  ప్రపంచంలో
ముస్లిములు వ్యవహరించే తీరు గురించి తెలిసిన ఏ తెలివైన విశ్లేషకుడైనా వారిగురించి
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంబేడ్కర్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఆయన ఇలా
అంటాడు, ‘‘ముస్లిముల సోదరభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే సోదరభావం కాదు. వాళ్ళ సోదరభావం
వారి మతం వరకే, వారి సమాజం వరకే పరిమితం. తమ మతానికి, తమ సమాజానికీ బైట ఉండేవారిని
ముస్లిములు శత్రువులుగా భావిస్తారు. నిజమైన ముస్లిం ఎవరూ భారతదేశాన్ని తమ
మాతృభూమిగా, హిందువులను తమ సోదరులుగా ఎన్నడూ భావించరు. అందువల్లే మౌలానా అలీ భారతీయుడైనప్పటికీ,
తను మరణించిన తర్వాత తనను జెరూసలేంలోని శ్మశానంలో పాతిపెట్టాలని కోరుకున్నాడు.’’

ముస్లిముల మానసిక స్వభావం:
ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ఒక ప్రత్యేకమైన ఆలోచనాధోరణి కలిగి ఉంటారని అంబేడ్కర్
వివరించాడు. ‘‘మతం విషయంలో ముస్లిములు ఎంత పట్టింపుతో ఉంటారంటే అభివృద్ధి చెందాలన్న
ఆలోచన వారిలో ఉండనే ఉండదు. ఇతర మతాలను అనుసరించే వారి విషయంలో కూడా ముస్లిముల
ఆలోచన ‘సర్వధర్మ సమభావం’ అంటే అన్ని మతాలనూ సమానంగా ఆదరించాలి అనే పద్ధతికి దూరంగా
ఉంటుంది. వాళ్ళ ఆలోచన ప్రకారం ముస్లిములు అభివృద్ధి వ్యతిరేక భావజాలం కలిగి
ఉంటారు. వారి స్వభావం మీద ప్రజాస్వామ్యం ఆవగింజంత ప్రభావమైనా చూపలేదు. వారికి వారి
మతమే అన్నిటికంటె గొప్పది. ఏ రకమైన అభివృద్ధినైనా వారు వ్యతిరేకిస్తారు. మొత్తం
ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ వారు అభివృద్ధి నిరోధకులుగానే ఉంటారు. సర్వకాల
సర్వావస్థల్లోనూ వారి దృష్టి తమ మతం మీద మాత్రమే ఉంటుంది. పాలకులు ముస్లిములు
కాకపోతే వారి ఉద్దేశంలో అది వారి శత్రువుల రాజ్యమే అవుతుంది. నిజమైన ముస్లిములకు భారతదేశం
తమ మాతృభూమి అనీ, హిందువులు తమ సోదర సమానులనీ భావించే అవకాశమే లేదు. ముస్లిముల
స్వభావంలోనే ఆక్రమించుకునే ప్రవృత్తి పొంచివుంది. హిందువుల బలహీనతను ఆసరా చేసుకుని
గూండాగిరీ చేయడం వారి స్వభావం.’’ (ప్రఖర్ రాష్ట్రభక్త్ : డా. భీమ్‌రావ్ అంబేడ్కర్
పుస్తకం నుంచి)

సెక్యులరిజం అర్థం
ఏమిటి? : ఇవాళ సెక్యులరిజం లేదా లౌకికవాదం పేరిట హిందువుల విశ్వాసాలపై
అన్నివిధాలుగానూ దాడి జరుగుతోంది. ఆ విషయంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ చాలా స్పష్టంగా
ఇలా చెప్పాడు, ‘‘ప్రజల మతభావనలను ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోకపోవడం
సెక్యులరిజం కాదు. లౌకికవాదం అంటే అర్థం ఏమిటంటే ఒక సమూహం యొక్క మతాన్ని మిగతా
మతాల మీద రుద్దడాన్ని పార్లమెంటు సహించదు. ఆ హద్దులను మాత్రమే రాజ్యాంగం
పరిగణిస్తుంది. సెక్యులరిజం అంటే ధర్మ విచ్ఛేదనం అని అర్ధం కాదు.’’

అంబేడ్కర్ ఆలోచనలను బట్టి
చూస్తే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ముస్లిం సంతుష్టీకరణ, మిగతా
మతాలపై ఉదాసీన భావన దేశానికి ప్రమాదకరమని చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అలాంటి
ప్రవృత్తి కలిగినవారి నుంచి సావధానంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

బ్రిటిష్ వారు
వెళ్ళిపోయాక మన బాధ్యత పెరిగింది: 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మనదైన
రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందరికీ సమాన హక్కులు లభించాయి. ఇంక కొన్ని బాధ్యతలు
కూడా పెరిగాయి. ‘‘మనదేశం తెల్లవారి పాలనలో ఉన్నప్పుడు ఎవరికి ఏ హక్కులు, అధికారాలు
ఇవ్వాలి అనేది ఆ పాలకుల చేతిలో ఉండేది. అప్పుడు మనం ఇతర వర్గాలతో గొడవలు
పడుతుండేవాళ్ళం. ఇప్పుడు మనం మిగిలిన వర్గాలు, దళాలతో సామరస్యంగా, సహానుభూతితో
వ్యవహరించాలి. చట్టబద్ధమైన పద్ధతిలో మనం ఎదగాలని కోరుకుంటే మనం మిగతా వారితో కలిసి
మెలిసి నడవాల్సిన అవసరముంది. పాత శత్రుత్వాలన్నీ మరచిపోవాలి. గతంలోలా ఒంటరిగా ఉంటే
పని జరగదు.’’ అని అంబేడ్కర్ స్పష్టం చేసాడు.

సంఘంతో సంబంధం: రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డా. హెడగేవార్, డా. అంబేడ్కర్ ఇద్దరూ
మహారాష్ట్రీయులే. ఆ మహాపురుషులు ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరి
కార్యక్రమాలకూ కేంద్రస్థానాల్లో ప్రముఖమైనది నాగపూర్ నగరమే. ఆనాటి హిందూ సమాజం
ఉన్న దుస్థితిని చూసి ఇద్దరూ బాధపడినవారే. ఆ ఇద్దరు మహాపురుషులు కూడా ఒకే సమస్య
పరిష్కారం గురించి ప్రయత్నించినవారే.

సంఘీయులారా, త్వరగా
పనిచేయండి: అంబేడ్కర్ 1953లో మోరోపంత్, ఇతర సంఘ కార్యకర్తలతో మాట్లాడాడు. సంఘం
గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. చివరిలో మాట్లాడుతూ మీరు మీ పనిని
త్వరగా చేయండి అని చెప్పారు. ‘‘మీరు సరైన పని చేస్తున్నారు. కానీ ఆ పని మందకొడిగా
సాగుతోంది. నా సమాజం ఇంత సుదీర్ఘకాలం వేచిఉండలేదు. నేను కమ్యూనిజాన్ని ఏమాత్రం
కోరుకోవడం లేదు. షెడ్యూల్డు జాతుల వారికి, కమ్యూనిస్టులకు మధ్య అంబేడ్కర్ అడ్డంకిగా
ఉన్నాడు. మిగతా హిందువులకు, కమ్యూనిస్టులకు మధ్య గోళ్వల్కర్ అడ్డంకిగా ఉన్నాడు’’
ఇవీ అంబేడ్కర్ అచ్చంగా చెప్పిన మాటలు.

అంబేడ్కర్ ఇచ్చిన ఈ
సందేశం ఇవాళ జాతీయవాద భావధారతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరికీ తమ పనిని వేగవంతం
చేయాలన్న ఆహ్వానమని చెప్పుకోవచ్చు.

‘‘నేను హిందూ సమాజ
సంస్కర్తను’’ – డా. బి.ఆర్ అంబేడ్కర్

ShareTweetSendShare

Related News

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.