Sunday, October 01, 2023

Odisha-365
google-add

BHARAT, SAUDI STRATEGIC MEET: భారత్ ‌కు  సౌదీ కీలక వ్యూహాత్మక భాగస్వామి..

T Ramesh | 15:19 PM, Mon Sep 11, 2023

భారతదేశపు అతిముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాదేశిక శాంతి, స్థిరత్వం స్థాపనకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇరు దేశాల మధ్య  పరస్పర సహకారం అవసరం అన్నారు. ప్రస్తుత చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, నూతన ఉత్సాహంతో పాటు సరైన దిశను సూచిస్తాయని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ మధ్య  ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యరంగం, ఆహార భద్రత, ఇంధన భద్రత అంశాలపై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య పరిషత్‌లో భాగంగా చర్చించారు.

సమాజ సంక్షేమం కోసం కలిసి పనిచేసేలా ఈ చర్చలు స్ఫూర్తి నింపాయన్నారు. భారత్, పశ్చిమ ఆసియా, యూరప్ మధ్య ఎకనామిక్ కారిడార్, ఆర్థిక పురోభివృద్ధితో పాటు డిజిటల్ సమన్వయానికి ఉపయోగపడతాయని వివరించారు. ఇరు దేశాల మధ్య సహకారం పశ్చిమ ఆసియాతో పాటు ఐరోపాకు కూడా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జీ -20 సదస్సులో పాల్గొనడంతో పాటు విజయవంతం అయ్యేందుకు సౌదీ అరేబియా పోషించిన పాత్రకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. సౌదీ అరేబియాలో ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ఆ దేశం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.

భారత్ కు రావడం సంతోషంగా ఉందన్న సౌదీ యువరాజు, జీ 20 సదస్సు విజయవంతం అయ్యేందుకు బారత్ అద్భుతంగా పనిచేసిందన్నారు. ఈ సమావేశాల ద్వారా కీలక ప్రకటన చేసే అవకాశం దక్కిందన్నారు. భారత్ తో కలిసి పనిచేసేందుకు సౌదీ అరేబియా ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

దివాలా తీసిన నగరం

P Phaneendra | 16:00 PM, Wed Sep 06, 2023
google-add

వీడియోలు

google-add
google-add
google-add

రాజకీయం