వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌కు 190కి.మీ ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర హెచ్చరించింది. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. గంటలకు 30 నుంచి 40కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో వర్షాలు నమదవుతున్నాయి. ఓ వైపు నైరుతి రుతుపవనాలు మరో వైపు, వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.