పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెలికి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ముందుగా మోతీ రామ్ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహించినట్లు గుర్తించారు. దాడికి కేవలం ఆరు రోజుల ముందు మోతీ రామ్ అక్కడ నుంచి బదిలీ అయినట్లు విచారణలో వెలుగు చూసింది.
సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న మోతీరామ్ 2023 నుంచి కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు గుర్తించారు. ఇందుకు పాక్ గూఢచారుల నుంచి లక్షల మొత్తంలో సొమ్ము తీసుకున్నట్లు తేలింది.మోతీ రామ్ భార్య ఖాతాల్లో లక్షల కొద్దీ నిధులు జమ అయినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది.
మోతీరామ్ కదలికలపై అనుమానంతో అతనిపై నిఘా ఉంచిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. అతని ఆన్‌లైన్ కదలికలపై నిఘా ఉంచారు. అతని సోషల్ మీడియా ఖాతాలపై నిఘా వేయగా విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులు, మోతీ రామ్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మోతీరామ్‌ను విధుల నుంచి తొలగించి సీఆర్పీఎఫ్ అధికారులు నాలుగు రోజులు విచారించారు. తాజాగా మోతీరామ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. భద్రతా దళాల మోహరింపు, సీక్రెట్ ఆపరేషన్ల వివరాలు పాకిస్థాన్ కు చేరవేసినట్లు గుర్తించారు. మోతీరామ్ ఎలాంటి సమాచారం చేరవేశాడనే దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది.