నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 24వ తేదీ నాటికే ప్రవేశించాయి. రుతు పవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేరళ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి.
నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించారు. రాబోయే రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.