భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది. తాజాగా భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ను వెనక్కు నెట్టి భారత్ నాలుగో స్థానం ఆక్రమించిందని ఐఎంఎఫ్ తాజా నివేదికలో పేర్కొంది.
అమెరికా, చైనా, జర్మనీ తరవాత భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంపై పలువురు ప్రముఖులు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 40 ట్రిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 18 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. 8 ట్రిలియన్ డాలర్లతో జర్మనీ మూడో స్థానం దక్కించుకోగా, 4 ట్రిలియన్ డాలర్లతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదగడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.