ఓ కామాంధుడి ఇల్లు కూల్చివేసి గ్రామం నుంచి ఉన్మాదిని బహిష్కరించారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.
గత వారం ఓ చిన్నారి అత్యాచారానికి గురైంది. ఈ కేసులో మోరగుడి గ్రామానికి చెందిన రహ్మతుల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతనిపై కేసు నమోదైంది. అయితే ఆగ్రహించిన మోరగుడి గ్రామస్థులు రహ్మతుల్లా ఇంటికి కూల్చివేశారు. కామాంధుడు గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడి తల్లి నాలుగేళ్ల కిందట కువైట్ వెళ్లారు. తండ్రి బేల్దారి పని చేస్తున్నాడు. ఐదేళ్ల కిందటే ఇంటిని విక్రయించారు. అయినా ఖాళీ చేయలేదు. తాజాగా రహ్మతుల్లా నివాసం ఉంటోన్న ఇంటిని గ్రామస్థులు కూల్చివేశారు. ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి అనుమతితో ఇంటిని కూల్చివేసినట్లు గ్రామస్థులు తెలిపారు.