తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని విష్ణు నివాసం, వసతి సముదాయం, శ్రీనివాసం, మాధవం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత దర్శన టోకెన్లు అందిస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఫెన్సింగ్ వేసిన క్యూలైన్లలో గంటల తరబడి నిలుచోవాల్సి వచ్చేది. ఒక్కోసారి తోపులాటలు చోటు చేసుకునేవి. తిరుమల నారాయణగిరి తరహాలో శాశ్వత క్యూలైన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.