భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి పరీక్షలకు సిద్దమైంది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవులపై విమానాల రాకపోకలను నిషేధించింది. మే 23, 24 తేదీల్లో ఈ ప్రాంతంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. రెండు రోజుల పాటు గగనతలంలో విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో క్షిపణి పరీక్షలు నిర్వహించడం లేదని భారత్ తెలిపింది.
శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల పాటు అంటే మూడు గంటల సమయం విమానాలు అండమాన్ నికోబార్ దీవులపై ఎగరడానికి అనుమతించబోమని భారత్ ప్రకటించింది. గతంలోనూ ఇలాంటి పరీక్షలు భారత్ నిర్వహించింది.
పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్లో పాక్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పెద్ద మొత్తంలో భారత్ ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 40 వేల కోట్ల రూపాయలతో తక్షణం ఆయుధాల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేసింది. మరో రెండు ఎస్ 400 వ్యవస్థలను రష్యా నుంచి త్వరగా తెచ్చేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది.