సామూహిక అత్యాచారం కేసులో బెయిల్ పొందిన నిందితులు ర్యాలీగా ఇంటికి వెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటన కర్ణాటకలోని హవేరీ సమీపంలోని అక్కి అలూర్‌లో చోటు చేసుకుంది. ఓ సామూహిత అత్యాచారం కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదలైన నిందితులు విజయోత్సవాలు చేసుకుంటూ వందలాది కార్లు, బైకులతో ర్యాలీ చేసుకుంటూ ఇంటికి వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశ వ్యాప్త చర్చకు దారితీసింది.
గత ఏడాది జనవరిలో ఏడుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు వ్యక్తులను జైలుకు పంపించారు. హనగల్‌లోని ఓ హోటళ్లో ఓ మహిళ తన స్నేహితుడితో ఉండగా,
నిందితులు బలవంతంగా గదిలోకి ప్రవేశించారు.తరవాత మహిళలను సమీపంలోని అడవిలోకి గుంజుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారించిన పోలీసులు మొత్తం 19 మందిపై కేసు పెట్టారు.
బాధితురాలు విచారణ సమయంలో నిందితులను గుర్తుపట్టడంలో ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో 12 మందికి బెయిల్ లభించింది. ప్రధాన నిందితులుకు మాత్రం గురువారం నాడు బెయిల్ లభించింది. బెయిల్ పొందిన తరవాత నిందితులు వ్యవహించిన తీరు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.