తమిళనాడు మద్యం కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమిళనాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ టాస్మాక్‌పై ఈడీ అధికారులు దాడులు జరిపారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు దాటుతోందని సుప్రీం సీరియస్ అయింది. సమాఖ్య పాలన భావనను ఈడీ దిక్కరిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టాస్మాక్‌పై జరుగుతోన్న మనీలాండరింగ్ దర్యాప్తుపై సుప్రీం స్టే విధించింది.
టాస్మాక్ మద్యం అమ్మకాల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. మార్చి నెలలో టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మే నెల మొదటి వారంలో టాస్మాక్ అధికారులు ఇళ్లలోనూ సోదాలు చేశారు. తమిళనాడు పోలీసులు, ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఈడీ అధికారుల దూకుడుపై తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు చేస్తోందని తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై ఇవాళ విచారణ జరిగింది.టాస్మాక్ అధికారులను హింసిస్తోందని ఆరోపించింది. తమిళనాడు సర్కారు వేసిన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు ఈడీ విచారణకు అనుమతించింది. తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈడీ అధికారుల తీరుపై మండిపడింది. ఈడీ అధికారులను నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పు పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించింది. దర్యాప్తు సంస్థ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని డీఎంకే నేతాలు ఆరోపించారు.