అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. 103 స్టేషన్లను జాతికి అంకితం చేశారు. ఏపీలోని సూళ్లూరుపేట, తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లను అభివృద్ధి పరిచారు.
ఆధునిక రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేసిన తరవాత ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 15, గుజరాత్ 18, రాజస్థాన్‌లో 8 స్టేషన్లను ఆధునికీకరించారు.
వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, మండలి ఛైర్మన్ బండ ప్రకాశ్ హాజరయ్యారు.