ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావలసి ఉంటుంది. కేటగిరి 1కి ఒక పాయింట్, కేటగిరి 2కి రెండు పాయింట్లు, కేటగిరి 3కి మూడు పాయింట్లు,కేటగిరి 4కి 4 పాయింట్లు, ఐదు స్టేషన్ పాయింట్లు కేటాయించారు.
సర్వీసు పాయింట్లు ఏడాదికి 0.5గా నిర్ణయించారు. మే 31 నాటికి ఖాళీలు, పదవి విరమణ చేసే స్థానాలు, హేతుబద్ధీకరణ ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, ఏడాది నుంచి విధులకు హాజరు కాని ఉపాధ్యాయుల ఖాళీలు,స్టడీ లీవ్ ఖాళీలను చూపించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.