సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. క్యాబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించారు. ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తాడిమర్రిలో అదానీ పవర్‌కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎకరాకు రూ.5 లక్షల వంతున భూ కేటాయింపులు చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది.
2260 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్టడీ కేంద్రాల ఏర్పాటుకు అనుమతించారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 500 ఎకరాలు కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదించింది. లెదర్ పుట్ వేర్ పాలసీకి ఆమోదం, పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు క్యాబినెట్ ఆమోదించింది.