ఏపీ లిక్కర్ కుంభకోణంలో నిందితులకు విజయవాడ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీంతో విజయవాడ సిట్ అధికారులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వచ్చే 3 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి సహా, సజ్జల శ్రీధర్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, బాలాజీ, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల రిమాండ్ పొడిగించారు.
మద్యం కుంభకోణంలో సిట్ అధికారుల విచారణలో రూ.3200 కోట్ల అవినీతి జరిగిందని తేలింది. అవినీతి సొమ్మును విదేశాలను తరలించడం, పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు చేయడం లాంటి అక్రమాలను సిట్ అధికారులు గుర్తించారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి విదేశాలకు పెద్ద ఎత్తున నిధులు తరలించినట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.