పహల్గాం ఉగ్రదాడి, భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరవాత పాక్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిర్వహించే బీటింగ్ రిట్రీట్ నిలిపివేశారు. కాల్పుల విరమణ కొనసాగుతూ ఉండటంతో తాజాగా పంజాబ్ పాక్ సరిహద్దుల్లోని మూడు చెక్ పోస్టుల వద్ద నేటి సాయంత్రం నుంచి బీటింగ్ రిట్రీట్ ప్రారంభించనున్నారు. అయితే దీనిపై పలు ఆంక్షలు విధించారు. బీటింగ్ రిట్రీట్ సమయంలో పాక్ సరిహద్దు గేట్లలను తెరవడం లేదని అధికారులు ప్రకటించారు.
తొలి రోజు మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి సాధారణ పౌరులకు కూడా ప్రవేశం కల్పిస్తారు.