యూకో బ్యాంకు మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్‌ను ఓ అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు రుణాల మంజూరులో అవినీతికి పాల్పడ్డారని గోయల్ ఆరోపణులు ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలోనూ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
గోయల్ యూకో బ్యాంకు సీఎండీ పనిచేసిన సమయంలో సీఎస్‌పీఎల్‌కు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేశారు. మంజూరైన అప్పులు రూ.6210 కోట్లను ఆ సంస్థ దుర్వినియోగం చేసిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. గోయల్ కుటుంబానికి చెందిన షెల్ కంపెనీలకు నిధులు తరలించినట్లు గుర్తించారు. మనీలాండరింగ్ వ్యవహారాలు ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది. మే 17న గోయల్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరచగా మే 21 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది.