విజయనగరం ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు సిరాజ్, సమీర్ రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారని తెలుస్తోంది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఇన్ స్టా గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సిరాజ్, సమీర్ సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు యువకులు ఉన్నారని పోలీసుల రిమాండు రిపోర్టులో వెల్లడించారు. ఈ ఆరుగురు మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేశారు. సౌదీ అరేబియాలో ఐసిస్ ఉగ్రవాదుల నుంచి వీరికి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
వీరిలో ఇద్దరు బాంబులు తయారు చేయడం. మిగిలిన వారు వాటిని హైదరాబాద్ నగరంలో కీలక ప్రాంతాల్లో పెట్టి పేల్చేందుకు ప్రయత్నించారని ప్రాధమిక విచారణలో తేలింది. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు విజయనగరం టుటౌన్ స్టేషన్‌కు చేరుకున్నారు. కేసు వివరాలను తెలసుకున్నారు.