వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జూన్ 2 వరకు రిమాండ్ విధించారు. శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ నందిగం సురేశ్‌పై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు నమోదైంది. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఆయన సోదరుడు ప్రభుదాస్, మరికొంత మంది రాజు అనే వ్యక్తిపై దాడికి దిగారని ఫిర్యాదు అందింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ పరీక్షించారు. ఆ తరవాత కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.