ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించనుంది. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాధ్రం..స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయం ప్రకటించారు. ఏడాదిలో లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తానని సీఎం హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. పొడి చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గుంటూరులో 16 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనిచేస్తోందని త్వరలో రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడపలో అందుబాటులోకి వస్తాయన్నారు.