ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ నుంచి దిగుతూ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకుడు సుబ్రతా ఘోష్ మరణించారు.తీవ్ర అనారోగ్యంతో అతను చనిపోయినట్లు గైడ్ తమంగ్ చంపల్ వెల్లడించారు. ఘోష్ అనారోగ్యంగా ఉన్నాడని కిందకు తీసుకు వచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లు గైడ్ చంపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘోష్ మృత దేహాన్ని హిమాలయ పర్వతాల నుంచి కిందకు తీసుకు వచ్చేందుకు పర్వతారోహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎవరెస్ట్ పర్వాతారోహకులు ప్రాణాలు కోల్పోవడం ఇది రెండో సారి. ఇటీవల ఫిలిప్పైన్స్‌కు చెందిన పిలిప్ శాంటియాగో ఎవరెస్ట్ ఎక్కుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.