ఏపీలో ఇవాళ భారీ వర్షాల కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలకు అవకాశముంది. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాద ముందని ఐఎండీ తెలిపింది. పిడుగులతోపాటు గంటలకు 30 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.