భారతదేశపు అణ్వస్త్ర చరిత్రను సవాల్ చేసే దిగ్భ్రాంతికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగు చూసింది. వికీలీక్స్ బైటపెట్టిన అమెరికా రహస్య దౌత్యలేఖ ద్వారా ఈ విషయం బైటపడింది. అదేంటంటే… నాటి ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశపు పరమాణు సాంకేతికతను అందజేయడానికి ఇందిరా గాంధీ సిద్ధపడింది. భారతదేశం మొదటి పరమాణు పరీక్ష చేసిన కేవలం కొన్ని నెలలకే, ఇందిరాగాంధీ పాకిస్తాన్‌కు ఆ టెక్నాలసీని షేర్ చేయడానికి సిద్ధపడింది.
న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం పంపించిన కేబుల్‌లో ఇందిరాగాంధీ పాకిస్తాన్‌కు హామీ ఇవ్వడం గురించి ప్రస్తావించారు. ‘‘భారతదేశం తన పరమాణు సాంకేతికతను (న్యూక్లియర్ టెక్నాలజీ) ఇతర దేశాలతో పంచుకోడానికి ఎంత సిద్ధంగా ఉందో, పాకిస్తాన్‌తో పంచుకోడానికి కూడా అంతే సిద్ధంగా ఉంది. ఇరు దేశాల మధ్యా విశ్వాసం, అవగాహన కోసం కొన్ని నియమాలు మాత్రం ఉంచాలని భావిస్తోంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
‘‘పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు పదేపదే పరమాణు సాంకేతికత గురించి బ్లాక్‌మెయిల్ ఎందుకు చేస్తున్నారో భారత ప్రభుత్వం అర్ధం చేసుకోలేకపోతోంది. ఆ ప్రయోగం శాంతియుత స్వభావం గురించి, ఆర్థిక ప్రయోజనాల గురించీ నేను పాక్ ప్రధాని (జుల్ఫికర్ అలీ) భుట్టోకు రాసిన లేఖలో స్పష్టంగా వివరించాను. ఇతర దేశాలతో తమ పరమాణు సాంకేతికతను పంచుకోడానికి సుముఖంగా ఉన్నట్లే పాకిస్తాన్‌తోనూ పంచుకోడానికి భారతదేశం సుముఖంగా ఉంది’’ అని ఇందిరాగాంధీ ఆ లేఖలో స్పష్టంగా రాసారు.
1971 పాకిస్తాన్-భారత్ యుద్ధం తర్వాత పాక్ మనను ఆగర్భ శత్రువుగా పరిగణిస్తోంది. ఆ యుద్ధం కారణంగా పాకిస్తాన్ తూర్పుభాగం విడిపోయి బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. దాన్ని తమ ఘనతగా కాంగ్రెస్ పార్టీ తరచూ గొప్పలు చెప్పుకుంటుంది. ప్రత్యేకించి, ప్రపంచ రాజకీయ యవనిక మీద నరేంద్ర మోదీ గత దశాబ్ద కాలంగా సాధిస్తూన్న విజయాలను తక్కువ చేసి చూపించడానికి కాంగ్రెస్ నానా అవస్థలూ పడుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ మీద చేపట్టిన మిలటరీ ఆపరేషన్స్‌ను నిలిపివేసి మోదీ అమెరికాకు లొంగిపోయారనీ, అదే ఇందిరాగాంధీ అమెరికాను ధిక్కరించి ప్రతాపం చాటుకున్నారనీ ప్రచారం చేస్తోంది.
ఏ ఇందిరా గాంధీ 1971లో పాకిస్తాన్ మీద విజయం సాధించి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసారని, ఏ ఇందిరా గాంధీ 1974 మే నెలలో పోఖ్రాన్‌లో పరమాణు పరీక్షలు చేసారని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందో, దురదృష్టవశాత్తు అదే ఇందిరాగాంధీ గురించి వికీలీక్స్ గొప్ప రహస్యాన్ని బట్టబయలు చేసింది. వికీలీక్స్‌లో భాగంగా బహిర్గతం చేసిన కేబుల్ ద్వారా, జుల్ఫికర్ అలీ భుట్టో పాలనాకాలంలో పాకిస్తాన్‌కు భారతదేశపు పరమాణు ప్రయోగాల సాంకేతికతను పంచుకుంటానని ఇందిరాగాంధీ ముందుకు వచ్చిన సంగతి వెల్లడైంది. పాకిస్తాన్ మీద తమకు విశ్వాసం కలిగితే చాలు అణు సాంకేతికతను అందజేస్తానని ఇందిర ఒప్పుకున్నారు.
ఆ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అణు సాంకేతికతను పాకిస్తాన్‌తో పంచుకోడానికి తను సిద్ధమని ఇందిరాగాంధీ చెప్పడానికి కేవలం మూడేళ్ళ ముందే, అంటే 1971లోనే పాకిస్తాన్ ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్’ పేరుతో భారతదేశం మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించింది. అయినప్పటికీ శాంతి పేరుతో ఇందిరా గాంధీ పాకిస్తాన్‌ను న్యూక్లియర్ టెక్నాలజీని అందజేయడానికి ముందుకు రావడం విచిత్రమైన, అంతకు మించి భారతదేశానికి విషాదకరమైన దౌత్యప్రయత్నం అనే చెప్పుకోవాలి.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి, ప్రత్యేకించి మోదీ ప్రభుత్వపు విదేశాంగ విధానంలోనూ, ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ మోదీ విజయాలను కించపరచడానికి 1971లో ఇందిరా గాంధీ విజయం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాంటి ఇందిరాగాంధీ, భారత్‌కు మొదటినుంచీ శత్రువుగానే వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు మన పరమాణు సాంకేతికతను ఇచ్చేస్తానని చెప్పారంటే, కాంగ్రెస్ వైఖరి అప్పుడూ ఇప్పుడూ దేశానికి వ్యతిరేకంగానే ఉందన్న సంగతిని అర్ధం చేసుకోవచ్చు.