గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించింది. శ్వాసతీసుకోవడంలో ఆయనకు తీవ్ర ఇబ్బంది రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీకి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై మరో రెండు కేసులు విచారణలో ఉండటంతో విడుదలలో జాప్యం చోటు చేసుకుందని తెలుస్తోంది.
అనారోగ్య కారణాలతో వల్లభనేని వంశీ బెయిల్ పొందారు. అయితే పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ఒక కేసులో బెయిల్ లభించినా విడుదల సాధ్యం కాలేదు. అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో జైలు అధికారులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ మూడుసార్లు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.