పహల్గాం ఉగ్రదాడిని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఖండించారు. మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆయన కొనియాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బాబ్ బ్లాక్‌మన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సరైన చర్యగా భావిస్తున్నామని ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ చెప్పారు. పాక్‌లోని 9ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కాల్పుల విరమణలో భాగంగా శాంతి చర్చలు సాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలు ధ్వంసం చేయాలంటూ ఎంపీ బాబ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని పార్లమెంటులో ఎంపీ బాబ్ ప్రశ్నించారు.
విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ బదులిచ్చారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్,పాక్‌తో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం అతి భయంకరమైనదని, దాన్ని అంతం చేసేందుకు ఇరు దేశాల మద్దతు అవసరం ఉందన్నారు. గతంలో కూడా ఉగ్రదాడులను ఎంపీ బాబ్ ఖండించారు.