Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జీవనశైలి

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

Phaneendra by Phaneendra
May 14, 2025, 07:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేయగల భారతదేశపు చేనేత కళాకారుల ప్రతిభను చూసి నివ్వెరపోయిన బ్రిటిష్ వారు, తమ దేశపు వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం కోసం మన చేనేత కళాకారుల చేతివేళ్ళను నరికివేసిన చరిత్రను చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పటికీ ఇంకా అంత అద్భుతమైన కళను ప్రదర్శించగల కళాకారులు ఉన్నారు. ఇప్పటికీ అలాంటి నాజూకైన చీరలు నేస్తున్నారు.

ఇవాళ, అంటే మే 14 బుధవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువైన కనకదుర్గ అమ్మవారికి, చేనేత కార్మికులైన భక్తులు అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించారు.    

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, తన తండ్రి నల్ల పరంధాములు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ప్రతీ రెండేళ్ళకోసారి తమ ఇలవేల్పు అయిన కనకదుర్గ అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం వారి ఆనవాయితీ. అలా ఈ యేడాది కూడా వారి కుటుంబం అమ్మవారి దర్శనానికి వచ్చారు.

ఆ సందర్బంగా అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర తయారుచేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఆ చీర బరువు 100 గ్రాములు, దాని పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు. ఆ చీరను పూర్తిగా పట్టు దారాలతో తయారు చేసారు. దానికి బంగారు జరీ అంచు నేశారు. అగ్గిపెట్టెలో పట్టిన ఆ చీరను తయారు చేయడానికి సుమారుగా ఐదు రోజులు పట్టిందని నల్ల విజయ్ కుమార్  తెలిపారు.

నల్ల విజయ్ కుమార్ చేనేత కళారంగంలో అద్భుతమైన కళాకారుడు. ఆయన గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, శాలువాను తయారు చేసారు. కుట్టు లేకుండా లాల్చీ పైజామాను, జాతీయ జెండాను రూపొందించారు. మూడు కొంగుల చీర, ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర, సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే చీర, దబ్బనంలో దూరిపోయే అంతటి సన్నని చీర, బంగారం చీర, వెండి చీర రూపొందించిన చరిత్ర ఆయన సొంతం.

ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్ ఆ చేనేత కళాకారుల కుటుంబాన్ని అభినందించి, అమ్మవారి ప్రసాదాలను అందించారు.

Tags: Goddess Kanaka DurgaHand Loom ArtisanIndrakeeladriNalla Vijay KumarSaree in Match BoxTOP NEWSVijayawada
ShareTweetSendShare

Related News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్
Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

Latest News

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.