ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. గోవింద్ బాలాజీ భారతి సిమెంటు కంపెనీలో పూర్తి కాలపు డైరెక్టరుగా ఉన్నారు.
మద్యం అవినీతి కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చినా గోవిందప్ప స్పందించలేదు. సీఎంలో మాజీ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి మూడు రోజుల కిందట నోటీసులు అందించారు. అయినా వారు స్పందించకపోవడంతో సిట్ అధికారులు వారి కోసం
గాలిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
మాజీ సీఎం జగన్‌రెడ్డికి బాలాజీ గోవిందప్ప బాగా సన్నిహితుడు.మద్యం సరఫరా చేయడం, ముడుపులు నగదు రూపంలో వసూలు చేయడం, వాటిని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంలో బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మద్యం కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డి ముడుపులు వసూలు చేసి
గోవిందప్పకు ఇచ్చే వారని, బాలాజీ వాటిని తాడేపల్లి పెద్దలకు అందించే వారని సిట్
విచారణలో తేలింది.