జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. తనిఖీలు నిర్వహిస్తోన్న బలగాలపైకి ఉగ్రవాది కాల్పులకు దిగాడు. ఎదురుకాల్పుల్లో షోపియాన్ ప్రాంతంలో ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు తెలుస్తోంది. ముందుగా కుల్గాం ప్రాంతంలో సైన్యం ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. అవి షోపియాన్‌కు విస్తరించాయి.
ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య మూడుగంటల పాటు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో లష్కరే తొయ్యబా ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది.